VKB: పెద్దేముల్ గ్రామానికి చెందిన నక్క శ్రీను అనే వ్యక్తి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తప్పిపోయారు. అనారోగ్యంతో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని, తిరిగి ఊరికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రైలు ఎక్కే క్రమంలో స్టేషన్లో ఉన్న విపరీతమైన రద్దీ వల్ల ఆయన కుటుంబ సభ్యుల నుంచి వేరుపడ్డారు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.