HYD: మీర్‌చౌక్ పీఎస్ పరిధిలో 11 ఏళ్ల మైనర్ బాలికను ఆటో డ్రైవర్ సయ్యద్ షబ్బీర్ అలీ కిడ్నాప్ చేసి, అత్యాచారయత్నం చేశాడు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న బాలికను తండ్రి పంపించాడని చెప్పి ఆటోలో తీసుకెళ్లాడు. భయపడిన బాలిక ఆటోలోంచి దూకగా, స్థానికులు ఆ డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.