ADB: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా జరుపుతున్న CM కప్ 2024 పోటీల్లో గుడిహత్నూర్ మండలానికి చెందిన యువకుడు కళ్ళెపెల్లి ప్రకాష్ జిల్లాస్థాయిలో రాణించి రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యారు. జిల్లాస్థాయిలో జరిగిన రెజ్లింగ్ పోటీల్లో తన ప్రతిభను కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ మేరకు మండల వాసులతోపాటు జిల్లా వాసులు అభినందించారు.