అన్నమయ్య: మద్యం మత్తులో ఇంట్లోకి చొరబడ్డ యువకులకు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారని మదనపల్లె తాలూకా సీఐ కళావెంకటరమణ తెలిపారు. ఆ మత్తులో బైక్ను నడపలేక పక్కనే ఉన్న కొత్తపల్లి శాంతిపురం కాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడ్డారని పేర్కొన్నారు. దీంతో స్థానికులు యువకులను తాళ్లతో బంధించి, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు.