VSP: యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని విజయనగరం SP వకుల్ జిందాల్ సోమవారం తెలిపారు. పద్మనాభం మండలం పొట్నూరుకి చెందిన అప్పలనాయుడు విజయనగరం జిల్లా మెంటాడ మండలానికి చెందిన బాలికను ప్రేమ పేరుతో మోసం చేశాడు. దీనిపై విజయనగరం 1వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని 2020లో పోక్సో కేసు నమోదైంది. విచారణ చేపట్టగా నేరం రుజువయ్యిందన్నారు.