ఒకప్పుడు వయసు పైబడిన వారికి మధుమేహం వచ్చేది. కానీ ఇటీవల కాలంలో వయసు సంబంధం లేకుండా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే ఉదయం పూట మనలో కనిపించే కొన్ని లక్షణాల వచ్చే మధుమేహం వచ్చే ప్రమాదాన్ని సూచిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మార్నింగ్ లేవగానే వికారం, వాంతులు వచ్చినట్లు అనిపించటం.. నిద్ర లేచాక కూడా కళ్లు సరిగా కనిపించకపోవటం, నిద్రలేచే సమయానికి నోరు తడారిపోవటం, ఎక్కువగా దాహం వేస్తే వెంటనే షుగర్ లెవల్స్ చెక్ చేసుకోవాలి.