SKLM: వాహనదారులు రహదారి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని జీ.మాడుగుల సీఐ బీ.శ్రీనివాసరావు, పెదబయలు ఎస్సై కే.రమణ సూచించారు. సోమవారం పెదబయలులో ఆటోలు, జీపులు ప్రైవేట్ వాహనదారులతో సమావేశం నిర్వహించారు. అతివేగం ప్రమాదమని, నిదానమే ప్రధానమని హితవు పలికారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని సూచించారు. పరిమితికి మించి ప్రయాణికులను వాహనాల్లో ఎక్కించవద్దని స్పష్టం చేశారు.