పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీ రాబోతుంది. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ నటించనున్నట్లు సమాచారం. ఈ మేరకు మేకర్స్ మృణాల్‌కు కథను వినిపించగా.. అందుకు ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం జనవరిలో స్టార్ట్ కానున్నట్లు సినీ వర్గాల్లో టాక్.