కోనసీమ: అయినవిల్లి శ్రీ వరసిద్ధి వినాయకుడు సర్వాలంకార భూషితుడై ముగ్ద మనోహరంగా భక్తులకు మంగళవారం దర్శనమిచ్చారు. పలు రకాల పుష్పాలతో స్వామివారికి విశేషాలంకరణ చేశారు. అర్చక స్వాములు స్వామివారికి మేలుకొలుపు సేవ ఘనంగా నిర్వహించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ ఈ కార్యక్రమం వైభవంగా జరిపించారు.