KRNL: ఆదోని మండలం గణేకల్లు గ్రామంలో నీటి వృథాను అరికట్టాలని సీపీఎం మండల కార్యదర్శి లింగన్న, సభ్యుడు వీరారెడ్డి తెలిపారు. గతంలో అనేకసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. 4 మినీ ట్యాంకులలో రెండింటికి మాత్రమే నీరు వస్తుందని, మిగతా రెండింటికి నీరు సరఫరా కావడం లేదన్నారు. అనంతరం ఎంపీడీవో జనార్దన్కు సోమవారం వినతి పత్రం అందించారు.