KNR: కేశవపట్నం ఆర్టీసీ బస్టాండ్లో కార్గో సేవలను హుజూరాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ ప్రారంభించారు. మండల ప్రజలకు సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సూపరింటెండెంట్ సారయ్య, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అన్వేష్, చంద్రమౌళి, బూర్ల మొగిలి తదితరులు పాల్గొన్నారు.