MNCL: చెన్నూరు మండలంలోని శివలింగాపూర్ గ్రామంలో CCI పత్తి కొనుగోలు కేంద్రాన్ని కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులకు మద్దతు ధర ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే లభిస్తుందని స్పష్టం చేశారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలన్నారు.