JGL: కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామ శివారులో గల వాగులో నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీని, నిన్న పట్టుకున్నట్లు ఎస్సై రవికిరణ్ తెలిపారు. పక్కా సమాచారం మేరకు గంభీర్పూర్ గ్రామ శివారులో వాగు ఏరియాలో పోలీసు సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టమన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారి కనిపించడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.