KMM: చింతకాని BJP మండల అధ్యక్షులు కొండా గోపి అధ్యక్షతన శుక్రవారం మండల కార్యశాల నిర్వహించారు. ప్రధాని మోడీ జన్మదినం పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు సేవా పఖ్వాడా అనే నినాదంతో వివిధ సేవ కార్యక్రమాలు చేపట్టనున్నారు. రాష్ట్ర యువమోర్చా సభ్యులు యార్లగడ్డ రాఘవ పాల్గొని ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ థీమ్‌తో వివిధ కార్యక్రమాల గురించి వివరించారు.