NZB: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపేలా నిధుల కేటాయింపులు జరిగాయని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో శనివారం ఘనంగా జరిగిన రంజాన్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈద్గాలో జీవన్ రెడ్డి ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు.