MDK: మంత్రి దామోదర్ రాజనర్సింహ శుక్రవారం అందోల్ మండలంలో పర్యటించనున్నారు. అందోల్ నియోజకవర్గంలోని 9 మండలాల ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార ప్రధానోత్సవానికి హాజరవుతున్నారని నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. సంగుపేటలోని శ్రీ లక్ష్మీదేవి గార్డెన్స్‌లో శుక్రవారం ఉదయం 10 గంటలకు నిర్వహించే సమావేశానికి సన్మాన గ్రహీతలు, టీచర్లుపెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.