BDK: జిల్లాలో జాతీయ స్థాయి కోర్సులతో ఏర్పాటు చేస్తున్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కలెక్టర్ జితేష్ వి పాటిల్ యూనివర్సిటీ ప్రాంగణాన్ని, సీఎం సభ స్థలాన్ని వారు పరిశీలించారు. అలాగే అధికారులకు పలు సూచనలు చేశారు.