WGL: ఉమ్మడి జిల్లాలో నామినేటెడ్ పదవుల కోసం రాజకీయ నాయకుల్లో మళ్లీ ఆసక్తి పెరిగింది. ఉగాది పర్వదినం నాటికి పదవుల భర్తీ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఆశలు మొలకెత్తాయి. గతంలో కొందరికి అవకాశం దక్కగా, ఈసారి ఎలాగైనా పదవి సాధించాలని ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అదృష్టం ఎవరిని వరిస్తుందో మరి.