KMM: మహిళా ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఆదివారం నుంచి 14, 15 ఏళ్లలోపు బాలికలకు హెచ్‌పీవీ టీకాలు పంపిణీ చేయనున్నట్లు డీఎంహెచ్‌వో డా.రామారావు తెలిపారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వజనాసుపత్రిలో కలెక్టర్ దురిశెట్టి అనుదీప్‌తో కలిసి వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభిస్తారని ప్రకటించారు.