AP: రాష్ట్రంలో ఈరోజు, రేపు ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. అలాగే, ఈరోజు దక్షిణ కోస్తాలో నెల్లూరు, బాపట్ల, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని తెలిపింది. వేడి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులు, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.