ADB: జిల్లా కేంద్రంలోని ఖుర్షిద్ నగర్ కాలనీలోని భగత్ కైలాస్ ఇంట్లో గురువారం జూదం ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు టూటౌన్ ఇన్స్‌స్పెక్టర్ కే.నాగరాజు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.1,680 నగదుతో పాటు అయిదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.