KRNL: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ప్రజల భద్రత రక్షణలో భాగంగా ప్రధాన రహదారుల్లో పోలీసుల పెట్రోలింగ్, గస్తీని ముమ్మరం చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. గురువారం జిల్లాలో ప్రధాని సభ వద్ద బాంబు స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి నేరాలు జరుగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.