గాజాలో రెండేళ్లుగా జరుగుతున్న భీకర యుద్ధం కారణంగా అక్కడి పరిస్థితులు దయనీయంగా మారాయి. ముఖ్యంగా ఆహార కొరత కారణంగా ఐదేళ్లలోపు వయసున్న దాదాపు 55వేల మంది చిన్నారులు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారని UN నివేదిక తెలిపింది. వారిలో 12,800 మంది పరిస్థితి మరింత దయనీయంగా ఉందని, 157 మంది చిన్నారులు సహా 460 మంది తినడానికి తిండి లేక చనిపోయారని వెల్లడించింది.