NRML: దిలావర్పూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కార్యాలయంలో శుక్రవారం పోషణ మాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సిడిపిఓ నాగలక్ష్మి మాట్లాడుతూ.. బాలింతలు గర్భిణీ స్త్రీలు పోషక పదార్థాలను తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీడీపీవో మానస, సూపర్వైజర్ ప్రసూన కుమారి, ఎంపీవో గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.