MNCL: నస్పూర్ శివారు సర్వే నెం.42లో ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించిన భూమిని అక్రమార్కుల కబ్జా నుండి కాపాడాలని శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అక్కూరు సుబ్బన్న మాట్లాడుతూ.. భూమి చుట్టూ కంచె వేసి, కబ్జా చేయడానికి పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.