NLG: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడంతో ఆశావహుల్లో నిరాశ నెలకొంది. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ బలంగా చెబుతూ, అందుకు ప్రత్యేక జీవోను కూడా జారీ చేసింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయగా, రిజర్వేషన్ల పెంపుపై కోర్టు స్టే ఇవ్వడం ఉమ్మడి జిల్లాలోని ఆశావహులను కలవరపరిచింది.