KRNL: ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి ఇవాళ తెల్లవారుజామున వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. తిరుమల నగర్, సాయి నగర్, లక్ష్మీనరసింహ నగర్, సాయిగణేష్ కాలనీ తదితర ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించి, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని కాలనీవాసులకు భరోసా ఇచ్చారు. దోమల వ్యాప్తి నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు.