కృష్ణా: భారతదేశ ఆయుర్వేద ప్రముఖుడు దీవి గోపాలాచార్యులు అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం నాగాయలంక మండలం భావదేవరపల్లిలో ఆయుర్వేద మార్తాండ దీవి గోపాలాచార్యులు విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం గ్రామ పంచాయతీ వారిచే ఆయుర్వేద కళాశాల పీజీ విద్యార్థులచే ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు.