తమిళ స్టార్ హీరో ధనుష్ నటనతో తన యాక్టింగ్‌ను పోల్చడంపై నటుడు ప్రదీప్ రంగనాథన్ స్పందించారు. తన నటన ధనుష్‌లా అనిపించడానికి కారణం తాను ఆయనలా ఉండడమేనని తెలిపారు. తాను అలాంటి పోలికలు నమ్మనని తేల్చి చెప్పారు. కాగా, ఈ నెల 17న ప్రదీప్ ‘డ్యూడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.