KMM: కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టే కేబినెట్లో ఆమోదం పొందుపరిచి బీసీ రిజర్వేషన్ ప్రవేశపెట్టిందని 24వ డివిజన్ కార్పొరేటర్ మురళీ అన్నారు. శుక్రవారం ఖమ్మంలోని మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్,బీజేపీ బీసీ రిజర్వేషన్‌కు అడ్డుపడుతుందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆగే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు.