NLG: తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహార పదార్థాలను ప్రజలు ఆహారంలో తీసుకోవాలని పోషకాహార మాసం కార్యక్రమంలో అవగాహన కల్పించారు. చిట్యాల మండలం వట్టిమర్తి అంగన్వాడీ కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులు హాజరై పోషకాహారంపై ప్రతిజ్ఞ చేశారు. నాగరాణి, భవాని, రజిత, ఇందిర, అరుణ తదితరులు పాల్గొన్నారు.