KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి ఇవాళ 23 మంది మహిళా పోలీసులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జీఎస్టీ అవగాహనపై మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన రెండు సమావేశాలకు మొత్తం 45 మంది మహిళా పోలీసుల్లో 17 మంది మాత్రమే హాజరయ్యారు. మిగతా 23 మంది గైర్హాజరు కావడంతో వారిని సంజాయిషీ కోరినట్లు తెలిపారు.