MBNR: హైదరాబాద్-పనాజీ సెక్షన్ పరిధిలోని మహబూబ్నగర్ నుంచి రాయచూరుకు(NH-167) వెళ్లే రహదారికి మహర్దశ పట్టనుంది. మహబూబ్నగర్ నుంచి కర్ణాటక సరిహద్దులోని గూడెబల్లూరు (రాయచూరుకు సమీపంలో) వరకు ఉన్న రెండు వరుసల రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(NHAI) నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన టెండర్లను NHAI ఆహ్వానించింది.