MDCL:108 అంబులెన్స్ సేవలు ఐదునెలల్లో మేడ్చల్ జిల్లాలో అత్యవసర వైద్య సేవల్లో కీలకంగా నిలిచాయి. 23 అంబులెన్సులు 16,979 కేసులలో స్పందించి 1419 గర్భిణీలు, 3169 ట్రామా బాధితులు, 1154 గుండె రోగులకు సేవలు అందించాయి. 15 గర్భిణీలకు అంబులెన్స్‌లోనే ప్రసవం జరిపి తల్లీబిడ్డలను కాపాడారు. 108 మేనేజర్ భూమా నాగేందర్ ప్రజాభిమానాన్ని వ్యక్తం చేశారు.