GNTR: తెనాలిలోని కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ ఆక్రమణల చెరలో కొట్టుమిట్టాడుతోంది. మార్కెట్ కాంప్లెక్స్ పడమర వైపు కాలవ గట్టు వెంబడి రోడ్డు మధ్య వరకు మాంసం షాపులు, ఇతరత్రా ఆక్రమణలు పెరిగిపోయాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందంటూ వాహనదారులు చెబుతున్నారు. ఇటీవల కౌన్సిల్ సమావేశంలో కూడా కౌన్సిలర్ యుగంధర్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు.