అన్నమయ్య: తంబళ్లపల్లి నియోజకవర్గానికి చెందిన జయచంద్రారెడ్డి ప్రజలకు ఉద్యోగాలు, అభివృద్ధి హామీలు ఇచ్చి, కల్తీ మద్యం తయారీలో పాల్గొని ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించారని బీఎస్పీ నాయకుడు మల్లికార్జున ఆరోపించారు. జయచంద్రారెడ్డి, అతని అనుచరులు అధికార పార్టీ అండతో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని మల్లికార్జున విమర్శించారు.