టెక్నాలజీ ప్రపంచంలో గూగుల్ మరో సంచలనం సృష్టించింది. మనుషుల్లాగే కంప్యూటర్ స్క్రీన్ చూసి, మౌస్తో క్లిక్ చేస్తూ, కీబోర్డుతో టైప్ చేస్తూ పనులు చేసే సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఈ టెక్నాలజీ ‘జెమిని 2.5 కంప్యూటర్ యూజ్’ పేరుతో విడుదలైంది. ఫారాలు నింపడం, డ్రాప్‌డౌన్ మెనూలను ఎంచుకోవడం వంటి పనులను కూడా ఇది సులభంగా చేయగలదు.