AP: సీఎం చంద్రబాబు ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. మ.3 గంటలకు ఈదగాలి గ్రామంలో విశ్వ సముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ ప్రారంభించిన తర్వాత నంద గోకులం సేవ్ ద బుల్ కాజ్, లైఫ్ స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి పాఠశాల విద్యార్థులతో ముచ్చరిస్తారు. పటిష్ట భద్రత మధ్య ఈ పర్యటనను ముగించుకుని, సా.5.30 గంటలకు సీఎం విజయవాడకు బయలుదేరుతారు.