CTR: కుప్పం ప్రాంతీయ అభి వృద్ధి సంస్థ (కడా) కార్యాలయం ఆవరణలో శుక్రవారం 10 గంటలకు ఎలక్ట్రానిక్ వస్తువుల మేళా జరుగుతుందని కడా రాజకీయ సలహా మండలి సభ్యుడు రాజ్‌కుమార్ తెలిపారు. వాషింగ్ మెషీన్లు, టీవీలు, ఏసీలు, ఫ్రిజ్‌లు, వాటర్ ప్యూరిఫైర్లు, మైక్రో ఓవెన్లు తదితర అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు ఈ మేళాలో తగ్గిన జీఎస్టీ ధరలకే లభిస్తాయన్నారు.