HYD: బంజారాహిల్స్లో హైడ్రా భారీ స్థాయిలో కూల్చివేతలు చేపట్టింది. సుమారు రూ.750 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి పై ఆక్రమణదారులు నిర్మించిన అనధికార నిర్మాణాలను అధికారులు తొలగించారు. హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి భారీ యంత్రాలను వినియోగించి కూల్చివేతలు నిర్వహించింది. ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నామన్నారు.