NZB: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిట్స్‌తో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందినట్లు వన్ టౌన్ SHO రఘుపతి శుక్రవారం తెలిపారు. ఈనెల 3వ తేదీన ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ వ్యక్తికి ఫిట్స్ రావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను గురువారం మృతి చెందాడు. మృతుడిని ఎవరైనా గుర్తుపడితే పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలన్నారు.