MBNR: బీసీ బిల్లుకు వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్లు కాదా? మీ ఆత్మసాక్షిగా చెప్పండి అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఈరోజు HYD లోని తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. జీవోల పేరుతో బీసీల చెవిలో పువ్వులు పెడతామంటే ఎవరూ నమ్మరని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.