ప్రకాశం జిల్లాలో నేటి నుంచి ఉచిత వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా చికిత్స చేసిన ఆసుపత్రులకు కూటమి ప్రభుత్వం బకాయిలు చెల్లించట్లేదని ఆసుపత్రి యాజమాన్యాలు తెలిపాయి. ఆసుపత్రులకు తమకు బకాయిలు చెల్లించే వరకు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. కోట్లాది రూపాయలు ప్రభుత్వం చెల్లించకుండా నిలుపుదల చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరారు.