విశాఖ: కంచరపాలెంలో ఇటీవల జరిగిన దోపిడీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో వృద్ధురాలు, ఆమె మనవడిని బంధించి.. భారీగా నగదు, బంగారం అపహరించుకుపోయారు. వృద్దురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టగా, ఆమె మనవడే ప్రధాన నిందితుడని గుర్తించారు. అప్పులు తీర్చుకునేందుకు మనవడే తన స్నేహితులతో కలిసి ప్లాన్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.