మంచిర్యాల: దండేపల్లి మండలంలోని తాళ్లపేట అటవీ రేంజ్ పరిధిలో ఉన్న అడవులలో నీటి సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నామని స్థానిక ఎఫ్ఆర్ఓ సుష్మారావు తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. సింగరాయపేట్, దమ్మన్నపేట తదితర అటవీ ప్రాంతాలలో నీరు లభించక వన్యప్రాణులు ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. అడవులలో ఉండే వాగుల వద్ద నీటి చెల్మలను ఏర్పాటు చేశామని ఎఫ్ఆర్ఓ వివరించారు.