MHBD: నియోజకవర్గానికి రూ.200 కోట్ల నిధులతో ఆధునిక సదుపాయాలుతో కూడిన ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు సాధించడంలో స్థానిక MLA మురళి నాయక్ కృషి ప్రధానంగా నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి MLA బుధవారం ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్టు తమ నియోజకవర్గానికి రావడం గర్వంగా ఉందన్నారు.