KNR: జిల్లా కలెక్టరేట్లో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో రామగుండం MLA పాల్గొన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల తీరుపై ప్రస్తావించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ధాన్యం కొనుగోలు, భూ భారతి, వానకాలం పంటల పరిస్థితి, రైతుల సమస్యలు తదితర వాటిపై చర్చించారు. కార్యక్రమంలో మంత్రులు, MLAలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.