TG: జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆన్లైన్ గేమ్స్‌కు బానిసై అప్పులు చేసిన కుమారుడు తండ్రిపై దాడికి దిగాడు. తాను చేసిన అప్పులు తీర్చాలని తండ్రిపై ఒత్తిడి చేశాడు. దీనికి తండ్రి నిరాకరించడంతో కత్తితో దాడికి పాల్పడ్డాడు. పరస్పరం దాడులు చేసుకోవడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. గాయపడ్డ తండ్రి కుమారుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.