»A Resident Of Hyderabad Was Killed In The Russia Ukraine War
Russia-Ukraine war: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాద్ వాసి మృతి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో పోరాడుతున్న హైదరాబాద్ వాసి మృతి చెందినట్లు అధికారులు ధృవికరించారు. యుద్ధంలో పాల్గొన్న భారతీయులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న సమయంలో అఫ్సాన్ మృతి చెందినట్లు బుధవారం అధికారులు వెల్లడించారు.
A resident of Hyderabad was killed in the Russia-Ukraine war
Russia-Ukraine war: రెండు సంవత్సరాలుగా రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ హోరాహోరిగా కొనసాగుతుంది. ఈ యుద్ధంలో హైదరాబాద్ వాసి మృతి చెందాడు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరఫున పోరాడుతున్నాడు మహ్మద్ అఫ్సాన్. హైదరాబాద్‌కు చెందిన 30 ఏళ్ల మహ్మద్ అఫ్సాన్ బుధవారం ప్రాణాలు కోల్పోయాడు. అఫ్సాన్ మృతిని అధికారులు ధృవీకరించారు. ఉద్యోగం విషయంలో మోసపోయిన అఫ్సాన్ రష్యన్ ఆర్మీలో బలవంతంగా చేరినట్లు తెలుస్తుంది. ఇలాంటి బాధితులు దాదాపు 20 మంది రష్యా సైన్యానికి సహాయంగా పనిచేస్తున్నారు.
ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్నా రష్యాకు సహాయక సిబ్బందిగా పని చేస్తోన్న వీరిని భారత్‌కు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ లోపే ఈ విషాదం చోటు చేసుకుంది. అఫ్సాన్ కుటుంబ సభ్యులు అతన్ని హైదరాబాద్ తీసుకు వచ్చేందుకు సాయం కోసం మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీని కలిశారు. మజ్లిస్ పార్టీ.. మాస్కోలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా.. అఫ్సాన్ మృతి చెందినట్లు అక్కడి అధికారులు చెప్పారు. విషయం తెలిసిన అఫ్సాన్ కుటుంబం కన్నీరు మున్నీరు అయ్యారు.