KMR: నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. గురువారం ప్రాజెక్ట్‌లోకి 41,680 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్ట్ 5 గేట్లను ఎత్తారు. ప్రస్తుతం మంజీరాలోకి 40,680 క్యూసెక్కులు, నిజాంసాగర్ ప్రధాన కాలువలోకి 1,000 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. 1,405.00 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది.